అధికారులు తెరాస పార్టీ తొత్తులుగా మారారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కుర్ ప్రతినిది: అధికారులు తెరాస పార్టీకి తొత్తులుగా మారారని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాలరాజ్ అన్నారు. బీర్కూర్ పోచారం కాలనీలో వివాదంగా మారిన ఇండ్ల నిర్మాణం ను బాధితులతో కలసి పరిశీలించారు. 14 మందికి కాలనీలో రోడ్లపై ఇండ్లు నిర్మించి కాలనీ వాసులకు ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వేరే ఎక్కడైనా స్థలం కొనుగోలు చేసి అర్హులందరికీ ఇండ్ల స్థలాలు అందచేసిన ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసారు, అక్రమంగా కాలనీ మధ్యలో ఇండ్లు నిర్మించడం ఆపివేయాల్సిందిగా బాధితుల తరపున స్టే తీసుకువచమని తెలిపారు. అధికారులు, నాయకులు బెదిరిస్తున్నారని బాధితులు తెలుపగ, అధికారులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారని ఎవరికి బయపడవద్దని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ దానిని ధిక్కరించడం ఏమిటని మండిపడ్డారు. ఇక్కడ పోలీసులను అడ్డుగా పెట్టుకుని పునాదులు తవ్వుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీటీసీ ల ఫోరమ్ మాజి అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు యమ రాములు, మాజి సర్పంచ్ సానెపు గంగారాం, రాచప్ప పటేల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతురం కాశిరామ్, ఆకుల భశెట్టి, ఖలేక్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.