ఎన్నికల నిబంధనలను ఎక్కడ అతిక్రమించలేదు

ఎమ్మెల్సీ వై. మల్లేశం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తాము ఎన్నికల నిబంధనలను ఎక్కడ అతిక్రమించలేదని ఎమ్మెల్సీ యెగ్గే మల్లేషం అన్నారు గురువారం తెలంగాణ భవన్లో ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

7వేల మందికి 93 కోట్ల రూపాయలు గొర్రెల కోసం నగదు బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని, మునుగోడు నోటిఫికేషన్ రాకముందే చాలా మంది నగదు డ్రా చేసుకున్నారని, ఎన్నికల నిబంధనలు ఎక్కడా అతిక్రమించలేదని తెలిపారు.

గొల్ల కుర్మలకు బీజేపీ చేసింది ఏమిటీ? మునుగొడులో 70శాతం మంది గొల్ల కుర్మలు నగదు ఖాతా దారులు డ్రా చేసుకున్నారు. ధర్నాల పేరుతో రాజగోపాల్ రెడ్డి డ్రామాలు..బీజేపీ నాయకులతో ధర్నా చేశారు. కురుమ గోలోళ్లను అడ్డం పెట్టుకోని తమాషా చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని కురుమ గోలోళ్లు తరిమికొట్టే రోజు తెచ్చుకోవద్దని సూచించారు. కురుమ గోలోళ్లు రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను చేశారు…అక్కడ ఏమైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా?

ఫ్రీగా నగదు వస్తున్నప్పుడు కురుమ గోలోళ్లు ఓపిక పట్టాలన్నారు. ముఖ్యమంత్రికి గొల్ల కురుమలపై అపారమైన నమ్మకం ఉంది. గొల్ల కురుమలు ఏకతాటిపై ఉంటే మరింత న్యాయం జరుగుతుంది,, మరో రెండు సీట్లు పెరుగుతాయి. గొల్ల కురుమలకు ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఇచ్చిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అను కొనియాడారు. గొల్ల కురుమలకు ఆత్మగౌరవ భవనాలు రెడి అయ్యాయి…రెండు మూడు నెలల్లో ప్రారంభించుకోబోతున్నాం. గొల్ల కురుమలకు బీజేపీ ఏమి చేసిందో చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి రాజకీయం చేసుకో..కానీ కులంలో చిచ్చు పెడితే మర్యాద దక్కదని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.