బిజెపిని అప్రతిష్టపాలు చేసేందుకే కేసీఆర్ కుట్ర

.. బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిజెపిని అభివృద్ధి స్తవాలు చేసేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శతవిధాల ప్రయత్నిస్తున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీని అప్రదిష్టపాల్జేసేందుకు కేసీఆర్ ఆడుతున్న దొంగ నాటకం ఆడుతున్నారని, ఎవరికో నోటీసులిస్తే బండి సంజయ్ కు ఏం సంబంధం అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. బట్ట కాల్చి మీదేస్తారా… సిట్ ను అడ్డం పెట్టుకుని బీజేపీపై బురద చల్లే యత్నాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. కేసీఆర్… మీ బంధువులు చేసే తప్పులన్నింటికీ మీరే బాధ్యులా అని ప్రశ్నించారు.  కేసీఆర్…. నీ ద్రుష్టిలో సిట్ అంటే సిట్(కూర్చోవడం).. హుట్ అంటే నిలబడటమేనా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.