ఆలయ భూములు హాంఫట్

.. బాలాజీ ఆలయ భూములు హాంఫట .. దేవుడి భూమికే రక్షణ కరువు .. చోద్యం చూస్తున్న దేవాదాయశాఖ అధికారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ బ్యూరో: బాలాజీ ఆలయ భూములు హాంఫట.. దేవుడి భూమికే రక్షణ కరువు.. చోద్యం చూస్తున్న దేవాదాయశాఖ అధికారులు.. దేవుడి భూమికే రక్షణ కరువైతే సామాన్య రైతు భూమికి రక్షణ ఎలా లభిస్తుంది అన్నట్లు తయారైంది ఈ వ్యవహారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకే రక్షణ కరువైంది. వివరాల్లోకి వెళితే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో పురాతనమైన శ్రీ బాలాజీ ఆలయం ఉంది .ఈ ఆలయానికి సంబంధించి 1,2,3,4,5,6,7,8,9,10 పలు సర్వే నంబర్లలో సుమారు ఆలయానికి సంబంధించి 240 ఎకరాల భూమి దేవాదాయ శాఖ ఆధీనంలో ఘట్కేసర్ పట్టణంలో బాలాజీ నగర్ లో ఉంది .ఈ భూమికి రక్షణ కరువైంది ఇప్పటికే ఈ భూమిలో 16 ఎకరాలు కౌలుకు అధికారులు వేలంలో అందించగా మిగతా భూమిలో సుమారు 208 ఎకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది .కొంతమంది ఏకంగా ఇల్లు నిర్మించుకొని సైతం ఏళ్ల తరబడి నివసిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది అధికార పార్టీకి చెందిన బడా నాయకులు సుమారు 19 ఎకరాల విస్తీర్ణాన్ని వెంచర్గా ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించేందుకు సమాయత్తమైనట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ బాలాజీ ఆలయ భూములను సంరక్షించాలని వెంకటాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.. ఆలయ భూములు కబ్జాపై విచారణ చేపట్టి చర్యలు చేపడతాం ఈవో భాగ్యలక్ష్మి.. వెంకటాపూర్ బాలాజీ ఆలయ దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ పై తెలంగాణ వెబ్ న్యూస్ ప్రతినిధి ఆలయ ఈవో భాగ్యలక్ష్మి వివరణ కోరగా ఇప్పటికే ఆలయ భూములు కబ్జా చేసిన వారికి కోర్టు నోటీసులు అందించడంతోపాటు నిర్మించిన ఇండ్లు సైతం కూల్చి వేయడం జరిగిందనీ అదేవిధంగా ప్రస్తుతం ఆక్రమణ జరిగిన భూమి పై పూర్తి విచారణ చేపట్టి కటిన చర్యలు తీసుకుంటామని ఆమె సమాధానం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.