ఎంపీ ధర్మపురి ఇంటిపై దాడిని ఖండించిన బూర నర్సయ్యగౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎంపీ ధర్మపురి ఇంటిపై జరిగిన దాడిని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై టిఆర్ఎస్ నాయకులు చేసిన దాడి అమానుషమని,  రాజకీయాలలో విమర్శలను ప్రతివిమర్శలతో ఎదుర్కోవాలి. కాని ఎంపీ ధర్మపురి అరవింద్ గఇంట్లోలేని సమయం చూసి వారి ఇంటిపై దాడి చేసి వారి తల్లిని భయభ్రాంతులకు గురి చేయటం ఏమిటని ప్రశ్నించారు. ఇలా దాడులకు తిరిగి బిజేపి ప్రతిదాడులు చేస్తే తట్టుకోగలరా? తెలంగాణ రాష్ట్రంలో హింసా రాజకీయాలను ప్రోత్సాహించటం టిఆర్ఎస్ పార్టీకి తగదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసిఆర్ గారు ఎప్పుడూ బిసిలకు వ్యతిరేకమే అనేదానికి ఈ దాడితో ప్రత్యక్షంగా రుజువు అయిందని స్పష్టం చేసారు. ఆర్ఎస్ పార్టీ దాడులలో ఎప్పుడూ బిసిలే బలవుతారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాణహాని ఉందని, ఎంపీ ఇంట్లో లేరని తెలిసి కూడా ఈ దాడికి పాల్పడడం అనేది ఎంత దారుణం అని ఆయన ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.