ఏపీలో బీజేపీ దశ దిశ లేని ప్రయాణం చేస్తోందా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఏపీలో కొంతకాలంగా జరుగుతున్న అనేకానేక రాజకీయ పరిణామాలు చూస్తే బీజేపీ ఎదగడం కంటే టీడీపీని తొక్కడమే ప్రధాన లక్ష్యంగా ఆ పార్టీ పెట్టుకుంది అని అంటున్నారు. ఏపీ లో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అందులో ఒకటి అధికారంలో ఉంటే మరోటి విపక్షంలో ఉంది. మరి బీజేపీకి పొలిటికల్ గా  స్కోప్ రావాలంటే ఏమి చేయాలి. అధికారంలో ఉన్న పార్టీని గట్టిగా తగులుకోవాలి కదా. కానీ ఏపీ బీజేపీ ఏమి చేస్తోంది.ఆ పార్టీకి దిశా నిర్దేశం చేస్తున్న కేంద్ర పెద్దలు ఏమి చేస్తున్నారు అంటే వారు ఏపీలో వైసీపీని ఏమీ అనవద్దు అన్నట్లుగానే ఉన్నారని అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి విపక్షంలో ఉన్న టీడీపీ మీద పడడమే బీజేపీ మార్క్ పాలిటిక్స్ అనుకోవాలి. లేకపోతే ఏపీలో బీజేపీ చేస్తున్నది ఏమిటి అన్నదే చర్చగా ఉందిపుడు.ఏపీలో వైసీపీ అయిదేళ్ళ పాలన తరువాత జనాలు విసుగుచెందితే ఆల్టర్నేషన్ గా ఏ పార్టీని చూస్తారు. ఆ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీనే కదా జనాలు ఎంచుకుంటారు. మరి బీజేపీ ఆ విధంగా వ్యవహరిస్తొందా అంటే జవాబు అయితే లేదు. ఏపీలో బీజేపీ ఎంతసేపూ వైసీపీ కసికందకుండా ఉండాలని ఆ పార్టీని పరిరక్షించే కార్యక్రమమే చేసుకుంటూ పోతోంది.అందువల్లనే ఇపుడు ఏపీ బీజేపీ బేఫికర్ గా బిందాస్ గా ఉంది. ఏపీ బీజేపీకి కావాల్సింది అధికారం కాదని కూడా అంటున్నారు. కేంద్రంలో తమ పార్టీకి మద్దతుగా నిలుస్తూ తమకు సహకరించే పార్టీనే వారికి కావాలి. ఆ లక్షణాలు నిండుగా మెండుగా వైసీపీలో ఉన్నాయి కాబట్టే వైసీపీని ఏమీ అనకుండా పొద్దుపొచ్చుతున్నారు అని అంటున్నారు.ర్శలు కూడా వస్తున్నాయి. అదెలా అంటే ఏపీలో బీజేపీ పెద్దల సభలకు అది కూడా  ప్రధాని లాంటి వారు వస్తే కనుక లక్షల్లో ప్రజలు తరలివచ్చే సభలు సక్సెస్ కావాలీ అంటే కచ్చితంగా వైసీపీ సపోర్ట్ కావాలి. అలాగే ఏపీలో టీడీపీని తిట్టాలి కట్టడి చేయాలీ అంటే కూడా వైసీపీనే కావాలి అని చెబుతున్నారు.అంతే కాదు ఏపీలో అందరికీ తెలిసినా తెలియనట్లుగా  బీజేపీ వైసీపీతో తన బంధాన్ని కొనసాగిస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీకి ఆల్టర్నేటివ్ గా తాము ఎదుగుదామని బీజేపీ ఎపుడూ అనుకోకపోవడం ప్రయత్నం చేయకపోవడమే విడ్డూరం. ఎంత చిత్రమంటే ఏపీలో బీజేపీ అధ్యక్షుడు ఎవరో కూడా కేంద్ర నాయకత్వానికి అవసరం లేదు. ఎందుకంటే ఏపీలో వైసీపీ పచ్చగా ఉంటే చాలు తమ పబ్బం గడుస్తుంది అన్న అంచనాల్లో వారు ఉన్నారని అంటున్నారు.మరీ ఈ విధంగా రాజకీఎయ దివాళాకోరుతనాన్ని ప్రదర్శిస్తే జనాలు ఏమనుకుంటారు అన్న ఆలోచన కమలదళానికి ఉందా అన్నదే చర్చ మరి. ఏపీలో వైసీపీ పాలన మీద వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను తాను సొంతంగా అయినా సొమ్ము చేసుకునే పరిస్థితి ఒక జాతీయ పార్టీగా బీజేపీకి ఎందుకు కొరవడింది అన్నదే కీలకమైన ప్రశ్న. అంతే కాదు దేశం మొత్తం జయించాలని ఆరాటపడుతున్న కాషాయ పార్టీ ఏపీకి వచ్చేసరికి మాత్రం ఒక ప్రాంతీయ పార్టీకి పక్క వాయిద్యంగా మారుతోందా అన్న సందేహాలు కూడా వారి చర్యల వల్లనే కలుగుతున్నాయని అంటున్నారు.ఏపీలో ఏ రోజూ వైసీపీ మీద అగ్రెస్సివ్ గా బీజేపీ పోరాడింది లేదు అన్నది అతి పెద్ద ఫిర్యాదు అంతే కాదు ధాటీగా మాట్లాడే నాయకులను సైతం సైడ్ చేస్తూ కేవలం నామమాత్రపు విమర్శలతో పొద్దు పుచ్చుతున్న ఏపీ బీజేపీ తాము వచ్చే ఎన్నికల్లో ఏదో చేస్తామని మెరమెచ్చు మాటలు చెబితే జనాలు ఎలా నమ్ముతారు అని అనుకుంటున్నారో అర్ధం కావడంలేదు అనే అంతా అంటున్నారు  ఏది ఏమైనా ఏపీ బీజేపీ మాత్రం దశ దిశ లేని ప్రయాణమే చేస్తోంది అన్న ఘాటైన విమర్శలు వస్తే జవాబు ఏమని చెబుతుంది అనే అంతా అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.