సిగ్నల్‌ వద్ద స్టాప్‌లైన్ దాటితే రూ.100 జరిమానా

ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగిస్తే రూ.1000 జరిమానా

నగరంలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు అమలులోకి రాగా.. పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ రోప్‌ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. వాహనదారులు పక్కాగా నిబంధనలు పాటించేలా చర్యలు ప్రారంభించారు. వాహనదారులు నిబంధనలు మీరితే వెంటనే జరిమానా విధిస్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద స్టాప్‌లైన్ దాటితే రూ.100 జరిమానా పడనున్నది. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగిస్తే రూ.1000 జరిమానా విధించనున్నారు. పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే రూ.600 జరిమానా విధించనున్నారు. దుకాణదారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.