జనాభా ప్రకారం బిసిలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతం కు పెంచాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇడబ్లుఎస్ రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి తొలగించి బిసిల విద్యాఉద్యోగ రిజర్వేషన్లను కూడా జనాభా ప్రకారం 50 శాతం కు పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రదాన కార్యదర్శి  నల్లమేకల విజయ డిమాండ్ చేసారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ఆద్వర్యం లో శుక్రవారం ఇడబ్లుఎస్ రిజర్వేషన్ల పై నల్లగొండ జిల్లా అంబేద్కర్ భవన్ లోబిసిసంక్షేమ సంఘంఉపాధ్యాయఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలోబిసి,ఎస్టి,ఎస్టి,మైనారిటీ  సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేసహానికి నల్లమేకల విజయ ముఖ్య అతిధిగా విచ్చేసి  ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఇడబ్లుఎస్ రిజర్వేషన్లను సమర్ధిస్తూ  తీర్పు చెప్పినందున జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను విద్యాఉద్యోగ రంగాలలో,స్థానిక సంస్థల ఎన్నికలలో కేంద్రంలో 27 శాతం నుంచి 50శాతం పెంచాలనిచట్టసభలలో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని అలాగే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసారు. ఇడబ్లుఎస్ రిజర్వేషన్ పై సుప్రీం కోర్ట్ తీర్పుతో SC ,ST ,BC ,మైనారిటీ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగు తున్దన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసారు.ఇటీవల ఇడబ్లుఎస్ రిజర్వేషన్లు చెల్లుతాయని50% గరిష్ట పరిమితి కూడా సరికాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే 103వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ 50 శాతం గరిష్ట పరిమితి తొలగించి ఇడబ్లుఎస్ – లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు.  కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీనితో రిజర్వేషన్లపై ఉన్న గరిష్ట పరిమితి తొలగిపోయింది. రిజర్వేషన్లపై న్యాయపరంగాచట్టపరంగారాజ్యాంగపరంగా  యున్న అవరోధాలు తొలగిపోయాయి.  కావున వెంటనే బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం కేంద్రంలో 27 శాతం నుంచి 50 శాతం  పెంచాలని కోరారు.అనంతరం సమావేశానికి అద్యక్షత వహించిన బిసి సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అద్యక్షులు దుడుక లక్ష్మినారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకుసామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేసారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మైనారిటి విబాగం అద్యక్షులు ఎం.ఏ. ఖదీర్ మాట్లాడుతూ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకుఅన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవీదన వ్యక్తం చేసారు.బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య హక్కు స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ – పార్లమ్మెటుల్లో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ కులాలను అందిచేస్తున్నారని విమర్శించారు. 2023 లో సేకరించి బోయే జనాభా గణనలో కులాల వారిగా బీసీ జనాభా గణన చేయాలని సమావేశం కోరింది. ఎస్సీ/ఎస్టీల జనాభా ను కులాల వారిగా సేకరిస్తున్నారు. బీసీల జనాభా సేకరించడానికి అభ్యంతరాలు ఏమిటిచట్టపరమైనన్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవు. పులులు తదితర జంతువుల లెక్కలు ఉన్నాయి. కానీ బిసి జనాభా లెక్కలు చేయాలంటే అనేక అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు.సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన సైదులు, వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాల వెంకటేశం, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్ సొల్లేటి ప్రభాకర్, పెరిక కరణ్, జయరాజ్, పాలడుగు నాగార్జున, పెరిక వెంకటేశ్వర్లు, ఎండి నజీర్, ఆదిమూల శ్రీనివాసులు, వెంకన్న దుర్గ రాందాసు, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.