సంక్రాతి నుండి మరోసారి కంటివెలుగు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  రానున్న సంక్రాంతి నేత్రపర్వం కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి మరోవిడత కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గతంలో చేపట్టిన ఈ కార్యక్రమం లక్షల మంది పేద వృద్ధులకు కంటివెలుగును అందించింది. ఊరూరా ఉచితంగా నేత్రపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. అవసరమైన వారికి కండ్లజోళ్లనూ అందించింది. ఈ నేపద్యం లో మరోసారి కంటివెలుగు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కంటివెలుగు కార్యక్రమం అమలుతీరునూతనంగా నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలుప్రజారోగ్యం తదితర అంశాలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా కంటిచూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ పథకం ద్వారా కంటిచూపు అందింది.

 

Leave A Reply

Your email address will not be published.