స్వైపింగ్ మిష‌న్ల వ‌ద్ద స్వైప్ లేకుండానే గ్రాస‌రీ షాపుల్లో షాపింగ్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఆన్‌లైన్ పేమెంట్ల‌ను మ‌రింత‌గా ప్రోత్స‌హించేందుకు నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సానుకూల నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇటీవ‌లే ప్రారంభించిన కొత్త ఫీచ‌ర్‌ను రూపే క్రెడిట్ కార్డుల‌తో భీమ్ యూపీఐ యాప్‌తో లింక్ చేయ‌నున్న‌ది. భీమ్ యూపీఐ యాప్‌తో లింక్ చేస్తే.. రోజువారీగా గ్రాస‌రీ షాపుల్లో షాపింగ్‌కు వెళ్లిన‌ప్పుడు బిల్లుల చెల్లింపున‌కు క్రెడిట్ కార్డుల‌ను స్వైపింగ్ మిష‌న్ల వ‌ద్ద స్వైప్ చేయాల్సిన అవ‌స‌రం లేదు.భీం యూపీఐపై రూపె క్రెడిట్ కార్డును లింక్ చేస్తే స్మార్ట్ ఫోన్‌లో యూపీఐ అకౌంట్ గ‌ల ఖాతాదారులు త‌మ కొనుగోళ్ల కోసం త‌మ మ‌ర్చంట్ షాప్స్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే స‌రిపోతుంది. రోజురోజుకు దేశంలో క్రెడిట్ కార్డుల వాడ‌కం 30 శాతం పెరుగుతున్న‌ది.పీవోఎస్ యంత్రాల వ‌ద్ద క్రెడిట్ కార్డుల వాడ‌కాన్ని ప్రోత్స‌హించేందుకే.. యూపీఐపై రూపె క్రెడిట్ కార్డును ఎన్పీసీఐ ప్ర‌వేశ పెట్టింద‌ని ఫిన్‌టెక్ సంస్థ మైండ్ గేట్ సొల్యూష‌న్స్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ ల‌లిత్ చౌద‌రి చెప్పారు. యూపీఐ యాప్‌తో రూపె క్రెడిట్ కార్డ్ లింక్ చేయ‌డం వ‌ల్ల రోజువారీగా స్టోర్ల వ‌ద్ద‌కు క్రెడిట్ కార్డు తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. క్రెడిట్ కార్డ్ పోగొట్టుకునే స‌మ‌స్య త‌లెత్త‌దు. స్కిమింగ్‌కు తావు ఉండ‌దు.సెలెక్టెడ్ బ్యాంకుల్లో మాత్ర‌మే భీమ్ యాప్ ద్వారా రూపె క్రెడిట్ కార్డు వాడ‌కాన్ని ఆర్బీఐ అనుమ‌తి ఇస్తున్న‌ది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఇండియ‌న్ బ్యాంక్ ఖాతాదారుల‌కు మాత్ర‌మే తొలుత భీం యాప్‌తో రూపె క్రెడిట్ కార్డు వాడ‌కాన్ని ఆర్బీఐ అనుమ‌తి ఇస్తున్న‌ది. ఈ మేర‌కు గ‌త సెప్టెంబ‌ర్ 20న ఎన్పీసీఐ స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది.సేవింగ్స్ అకౌంట్‌తోపాటు జారీ చేసే డెబిట్ కార్డు మాదిరిగానే రూపె క్రెడిట్ కార్డును యూపీఐ యాప్‌తో లింక్ చేయొచ్చు. యూజ‌ర్లు త‌మ స్మార్ట్ ఫోన్‌లో భీమ్ యాప్ ఇన్‌స్ట‌ల్ చేసుకోవాలి. ఆ యాప్‌లోకి వెళ్లి `యాడ్ క్రెడిట్ కార్డుఆప్ష‌న్ క్లిక్ చేయాలి. మీకు రూపె క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకు పేరు ఎంపిక చేసుకోవాలి.త‌దుప‌రి ద‌శ‌లో యూపీఐ యాప్‌లో రూపె క్రెడిట్ కార్డు డిస్‌ప్లే అవుతుంది. యూజ‌ర్ దాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అటుపై రూపె క్రెడిట్ కార్డుపై గ‌ల సిక్స్ డిజిట్స్వ్యాలిడిటీ వివ‌రాలు న‌మోదు చేయాలి. దీంతో క‌స్ట‌మ‌ర్‌కు ఎస్ఎంఎస్‌గా వ‌చ్చే ఓటీపీని న‌మోదు చేయాలి. చివ‌రిగా న్యూ యూపీఐ పిన్ త‌ప్ప‌నిస‌రిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్ర‌క్రియ పూర్త‌యితే యూపీఐ యాప్‌తో రూపె క్రెడిట్ కార్డు లింక్ అవుతుంది.యూపీఐపై రూపె క్రెడిట్ కార్డుతో చెల్లించాల‌నుకునే క‌స్ట‌మ‌ర్లు షాప్ లేదా మ‌ర్చంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంపిక చేసిన రూపె క్రెడిట్ కార్డుతో డెబిట్ ఆప్ష‌న్ సెలెక్ట్ చేయాలి. చెల్లింపుల‌కు త‌ప్ప‌నిస‌రిగా యూపీఐ పిన్ న‌మోదు చేయాల్సి ఉంటుంది. క‌స్ట‌మ‌ర్లు బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డుతో అనుసంధానించిన మొబైల్ ఫోన్ నంబ‌ర్‌నే యూపీఐ పిన్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.