ఆలయ భూములను కాపాడుకోవడం అందరి భాద్యత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల పై వస్తున్న వార్త కథనాలపై ఈరోజు ఘట్కేసర్ పత్రిక సమావేశం లో రాష్ట్ర స్థానిక సంస్థల గౌరవ అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆలయ సంబంధిత భూములను కబ్జాకు గురవుతున్నాయని అక్రమార్కులు అవినీతికి పాల్పడుతున్నారని మండల పరిషత్ అధ్యక్షుడిగా ఆలయ భూములను కాపాడవలసిన మనందరి బాధ్యత అని అన్నారు రెవిన్యూ అధికారులు ఎండోమెంట్ అధికారులు కొంతమందికి సానుకూలంగా పనిచేస్తున్నారు అని పేద ప్రజల ఇళ్లను కూలగొడతాము అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మునుగోడు ఎన్నికల కోసం సిటీ ఓట్ల కోసం దాదాపుగా 40 కాలనీలను రెగ్యులరైజేషన్ చేశారు అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో ఉన్న పేద ప్రజల ఇండ్లను కూడా రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు అధికారులు కుమ్మక్కై వ్యాపారం కోసం ఎండోమెంట్ భూములను వాడుతున్నారని పేద ప్రజలను మోసం చేస్తూ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవాలయ భూములు రక్షించాలని కానీ కబ్జా గురవుతున్న భూములపై ఇన్ని ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని అధికారుల హస్తం ఉండటం బాధాకరమని ప్రజలకు అండగా మేము ఎప్పుడు ఉంటామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.