ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వములో తెలంగాణలో చేపల పెంపకం పరిశ్రమగా అభివృద్ధి చెంది నీలి విప్లవం కొనసాగుతోందని, మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని, నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్రంలోని మత్సకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాకతీయులు, రెడ్డి రాజులు అందించిన చెరువులను సుసంపన్నం చేసి, రిజర్వాయర్ల నిర్మాణంతో జల కళను తెచ్చి తెలంగాణ రాష్ట్ర జీవికను సుస్థిరం చేసారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాయకత్వములో మత్స్యసంపదను పెంచేందుకు విశేషమైన కృషి జరుగుతుందన్నారు. కళాశాలలో ఏర్పాటు చేశారని, మత్స్య సంపద వల్ల రాష్ట్రంలోని 30లక్షల మంది మత్స్యకారులు లబ్ధిపొందుతున్నారని, ఇప్పటికే 23వేల చెరువులను జియోట్యాగింగ్‌ అయ్యాయని తెలిపారు. నీటి సంపదన పెంచి, చేప పిల్లలను ఉచితంగా ఇచ్చి, వాటిని పెంచడానికి పరికరాలను అందించి, మత్స్య సంపదనను ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చి, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్న సందర్భంగా మరోసారి రాష్ట్ర మత్స్యకారులందరికీ ప్రపంచ మత్స్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.