ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు అడుక్కోవలసి వచ్చేది.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్ ప్రతినిధి: ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాలలో అభివృద్ధి కి నిధులు అడుక్కోవలసి వచ్చేదని, నిధుల విడుదలకు ఆంధ్ర పాలకులు సవతి తల్లి ప్రేమ చూపెట్టేవారని సభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం రోజు బీర్కూర్ మండలం చించెల్లి, కిష్టాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామాలకు చేరుకున్న ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం కిష్టాపూర్లో 26లక్షల రూపాయల నిధులతో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, గ్రామాలలో మౌలిక వసతులకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని, దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తూ ప్రజల దీవెనలు అందుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, కిష్టాపూర్ సర్పంచ్ పుల్లేన్ బాబురావు, చించెల్లి సర్పంచ్ అంబయ్య,అన్నారం సర్పంచ్ కిష్టరెడ్డి,జడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ సభ్యులు భారతి, సందీప్, కో ఆప్షన్ ఆరీఫ్, పాక్స్ చైర్మన్ కొల్లి గాంధీ,ఉప సర్పంచ్ నర్సారెడ్డి,నాయకులు సతీష్, ద్రోణవల్లి అశోక్, రాధాకృష్ణ,సాయిలు, మాజి సర్పంచ్ గంగొండ, దండు గంగాధర్, హన్మగౌడ్, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ భానుప్రకాష్, జిపి కార్యదర్శి కృష్ణకుమారి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.