కేసీఆర్ కిట్ ను అందజేసిన జిల్లా వైద్య శాఖ అధికారి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర రావు ఆకస్మిక తనిఖీలలో భాగంగా ఓ మహిళకు స్వయంగా కేసీఆర్ కిట్ అందజేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి తదితర సిబ్బంది చించొడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన సమయంలో దేవునిపల్లి గ్రామానికి చెందిన స్వాతికి రెండవ డెలివరీలో బాబు జన్మించారు. అతని బరువు రెండున్నర కిలోలు, వెంటనే స్వాతికి కెసిఆర్ కిట్టును జిల్లా డిఎంహెచ్ఓ మరియు డిప్యూటీ డిఎమ్అండ్ హెచ్ఓ చేతుల మీద అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ కె. శ్రీనివాసులు మరియు షాద్ నగర్ డివిజన్ హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు మరియు డాక్టర్ ఆనంద్ నాయక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.