మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

తెలంగాణ జ్యోతి/వేబ్ న్యూస్: హైదరాబాద్ లోని పలువురు రాజకీయనేతలు, వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. ఉదయం తెల్లవారుజాము నుంచే మంత్రి చామకూర మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసులు, యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో ఇన్ కం ట్యాక్స్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు జరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుళ్ళ నివాసాలతో పాటు  మల్లారెడ్డి తమ్ముళ్ల ఇళ్లపై తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 టీములుగా విడిపోయిన ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్లు తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మల్లా రెడ్డి యూనివర్సిటీ ,మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి,  మహేందర్ రెడ్డి. కాలేజీలు రియల్ ఎస్టేట్ రంగాల్లో మొత్తాన్ని కూడా డైరెక్టర్ గా ఉన్నారు మల్లారెడ్డి అల్లుడు, కుమారుడు.

కొంపల్లిలోని పాం మెడోస్ విల్లాలో ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీలకు మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. మంత్రి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సహా వారి బంధువుల ఇండ్లల్లోనూ ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తోంది.  మంత్రి మల్లారెడ్డి కి చెందిన కండ్లకోయా లోని  CMR ఇంజనీరింగ్ కాలజీల్లో  ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్స్ ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.