25 న రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర సదస్సు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి ఆద్వర్యం లో ఈ నెల 25 న హైదరాబాద్ లోని భాగ్-లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో రైతన్నలను మేల్కొ అనే నినాదం తో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి గౌరవ అద్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. సోమవారం మీడియా సమావేశం లో రైతు హక్కుల సాధన సమితి నేతలు జి.బాబు యాదవ్,గాలి సంపత్, గుర్రం నర్సింహులు,జింకల యాదగిరి లతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశం లో రాష్ట్రము లో రైతులు ఎదురుకొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం బవిషత్ కార్యాచరణ ప్రణాలికను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. దేశానికి రైతు వెన్నుముఖ అనిరైతు లేనిదే దేశం లేదని,దేశం లో రైతులను  కాపాడుకోవలసిన బాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉందని అన్నారు. నేడు దేశం లో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆదార పడి ఉన్నారనికాని గిట్టుబాటు దర లేక దేశానికి అన్నం పెట్టె రైతులు ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం  చేసారు. ఫర్టలైజర్స్ ధరలు పెరగటంఅతి వృష్టి అనా వృష్టి , అకాల వర్షాలుఅదిక వడ్డిలకు రుణాలు వంటి అనేక కారణాలతో నేడు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరన్నారు. అంతే కాకుండా పంట పండి మార్కెట్కు వెలితే దళారుల దోపిడిలు రైతులను బలితీసుకుంటున్నాయన్నారు.పరిశ్రమల పెరుతో వ్యవసాయ భూమి తగ్గటం ,వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజురోజుకు తగ్గి పోతుందన్నారు.ఇలాంటి పరిస్థితులను పాలకులు సరిదిద్దకపోతే ప్రజలకు ఆహరం దొరకని రోజులు వస్తాయనిదేశం లో ఆకలి చవులు పెరిగే అవకాశం లేకపోలేదన్నారు.ఈ క్రమం లో  రైతు సమస్యల పై అవగాహన బాద్యతల అప్పగింత మొదలగు విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.సభావేదిక నిండుగాసమకూడే సభాపతుల కన్నులపండుగగా జరుగనున్న అతిరథమహాశయులైన 33 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నట్లు ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు.ఈ సమావేశం లో  అరుదైన-అద్భుతమైన ఈ మహాసభకు అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.