రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

.. చలితో వణికిపోతున్నా ప్రజలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో రోజురోజుకు చలితీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. సోమవారం తెల్లవారుజామున ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక అడవుల నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌లో 9.3 డిగ్రీలుఆదిలాబాద్‌లో 9.4, మంచిర్యాల 13.4, నిర్మల్‌ జిల్లాలో 13.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వికారాబాద్‌రంగారెడ్డిమేడ్చల్‌ జిల్లాల్లో 9 డిగ్రీలు నమోదయింది. రానున్న రెండు రోజుల్లో రాత్రిపూట చలి మరింత తీవ్రమవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఆదిలాబాద్‌నిర్మల్‌నిజామాబాద్‌కామారెడ్డిసంగారెడ్డిమెదక్‌వికారాబాద్‌రంగారెడ్డిమేడ్చల్‌ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో శీతల గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.