అధికారి కాలర్ పట్టుకున్న ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఓ అధికారి గల్లా పట్టి దుర్భాషలా . దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల తాత్కాలిక భవన ప్రారంభోత్సవాన్ని సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమా నికి జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తదితర ప్రజాప్రతినిధులను ఆహ్వానిం చారు. కార్యక్రమానికి ముందుగా సరితా తిరుపతయ్య హాజరయ్యారు. ముందుగా అధికారులు గేటు వద్ద రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాలని ఆమెను అధికారులు కోరారు. -ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే ప్రారంభిద్దామని ఆమె చెప్పినా… ఆయన వచ్చే సరికి లేట్ అవుతుంది.. మీరు ప్రారంభిం చండి అని అధికారులు చెప్పారు. దీంతో సరిత రిబ్బన్ కట్ చేశారు. కొంతసేపటికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గురుకుల పాఠశాల వద్దకు వచ్చారు. గేటు వద్ద రెబ్బన్ కట్ చేసి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారు? అని అధికారులను ప్రశ్నించారు. జెడ్పీ చైర్ పర్సన్ క్షమాపణ కోరారు. ఈ క్రమంలో గురుకుల పాఠశాలల రీజినల్ కో-ఆర్డినేటర్ వెంగల్ రెడ్డి కల్పించుకొని ఏదో చెప్పడంతో.. ఎమ్మెల్యే మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఆ అధికారి గల్లా పట్టుకు ఉన్నారు. అంతటితో దుర్భాషలాడారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా అధికార పార్టీ నేతలు ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ.. బహిర్గతం కావడంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కృష్ణ మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు. వెంగల్ రెడ్డి తనను ఎమ్మెల్యేనని చూడకుండా అనుచిత వాఖ్యలు చేయడంతో అడగడానికి అతడి వద్దకు వెళ్లానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.