కాలువ గండ్లను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికారి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా కంగ్జి మండల పరిధిలోని తడ్కల్ పెద్ద చెరువు కాలువ గండ్లను మంగళవారం పర్యవేక్షించిన క్వాలిటీ కంట్రోలర్ డి ఈ ఈ నాగరాజు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా కురవడంతో రైతుల భూములకు నీళ్ళు పారే కాలువ వెంబడి రెండు మూడు చోట్ల గండి పడటంతో వ్యవసాయ భూములు నీట మునగడం జరిగింది. గ్రామ సర్పంచ్ గడ్డపు మనోహర్ వెంటనే స్పందించి ఇసుక బస్తాలతో కాలువ గండ్లను మరమ్మత్తు చేయడం జరిగింది. వర్షాకాలంలో వేసిన తాత్కాలిక కాలువ గండ్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ఆయకట్టు రైతులు కాలువ వెంబడి పడిన గండ్లను పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి పంట పొలాలను నీళ్లు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ రమేష్, ఇరిగేషన్ ఏఈ రవి, రైతు గుండప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.