అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల గంజాయి పట్టివేత

.. భద్రాచలం తరలిస్తుండగా షాద్ నగర్ వద్ద పట్టుకున్న పోలీసులు .. గుంటూరు, కర్నూల్ మీదుగా, హైదరాబాద్ వెళ్ళే క్రమంలో .. టాటా కారు, సెల్ ఫోన్ సీజ్ .. షాద్ నగర్ పోలీసు, శంషాబాద్ ఎస్ఓటి పోలీసులకు అభినందనలు .. మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసీబీ కుశాల్కర్ వెల్లడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటి పోలీసుల సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి, జాతీయ రహదారి-44 మీదుగా హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు చకచకంగా పట్టుకున్నారు బుధవారం షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఏసిపి కుశాల్కర్ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు ఇందులో భాగంగా ఓ వ్యక్తితో పాటు టాటా కార్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఏసీబీ కుశాల్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 110 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని రాయికల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకోవడం జరిగిందని ఏసీపీ వివరించారు. నేరస్థుల జాబితాకు సంబంధించి కుర్వ రమేశ్ (35) వృత్తి ప్రయివేటు డ్రైవరు రంగ సముద్రం, ఎల్లంపల్లి (మొగిలిగిద్ద గ్రామం), ఫరూఖ్ నగర్ మండలం. ప్రస్తుతం, హైదరాబాద్ లోని, దిల్ సుఖ్ నగర్., చైతన్యపురిలోని మారుతి నగర్, (పోలీసు వారి అదీనంలో ఉన్నాడు). మరో నిందితుడు వీరన్న,(30) గూడూరు గ్రామం, నర్సాపేట్ మండలం, వరంగల్ జిల్లా, అదేవిధంగా మరో నిందితుడు సోమరాజు ఇతనిది బద్రాచలం. వీరు ఇద్దరు పరారీలో ఉన్నారని వివరించారు. ఆపరేషన్ మోడ్ నిందితుడు కుర్వ రమేశ్ వరంగల్ కు చెందిన వీరన్న ఆదేశం మేరకు, భద్రాచలం వెళ్ళి, అక్కడ సోమరాజు అనే వ్యక్తిని కలిసి, అతని ద్వారా అందాజ 110 కిలోల ప్రభుత్వంచే నిషేదించిన గంజాయిని చిన్న చిన్న పాకెట్లుగా మొత్తం 110 పాకెట్లలో ప్యాక్ చేసుకొని, వాటిని నిందితుడు రమేశ్, తన యొక్క టాటా కార్ నెం. టీఎస్10ఈఎం- 7999 గల దానిలో వెనక బాగంలో ఒకదానిమీద ఒకటి పేర్చుకొని, ఎవ్వరికీ అనుమానం రాకుండా అద్దాలకు నల్లని షేడ్ వేసుకొని, భద్రాచలం నుంచి బయలుదేరి, నేరుగా హైదరాబాద్ వెళ్తే ఎక్కడైనా పోలీసు వారు పట్టుకుంటారేమో అని తెలివిగా గుంటూరు, కర్నూల్ మీదుగా, హైదరాబాద్ వెళ్ళే క్రమంలో రాయికల్ టోల్ గేట్ దగ్గర నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో పట్టుకోవడం జరిగింది. వీటితో పాటు ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనముచేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శంషాబాద్ డిసిపి, మరియు షాద్ నగర్ ఏసీపీ పర్యవేక్షణలో శంషాబాద్ ఎస్ఓటి ఎస్సై రాజేశ్వర్ రెడ్డి, మరియు అతని సిబ్బంది సహాయంతో, కేసు విచారణాధికారి షాద్ నగర్ సిఐ ఎస్. నవీన్ కుమార్, సిబ్బంది విజయ్, మరియు కానిస్టేబుల్ సిబ్బంది రాయికల్ టోల్ గేట్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తూ, నిందితుణ్ణి పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇట్టి కేసు చెదనలో చాకచక్యంగా వ్యవహరించిన షాద్ నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, షాద్ నగర్ ఎస్సై విజయ్, కానిస్టేబుల్ సిబ్బంది, మరియు ఎస్సై రాజేశ్వర్ రెడ్డి సిబ్బందిని అభినందించారు. మరియు వారికి తగిన రివార్డ్ లను పై అధికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో 735/2022 అండర్ సెక్షన్ 20(బి)(ఐఐ)(బి) ఆఫ్ ఎండిపీఎస్ చట్టం కింద విచారణ జరుగుతున్నట్టు ఏసిపి కుశాల్కర్ తెలిపారు.. కేపీ

Leave A Reply

Your email address will not be published.