బీసీ కార్పొరేషన్ కి వెంటనే 20 వేల కోట్లు బడ్జెట్ ను కేటాయించాలి

.. రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు సి రాజేంద్ర ముదిరాజ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీసీ కార్పొరేషన్ నిధులు బడ్జెట్ 20వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు చెరుకుల రాజేంద్ర ముదిరాజ్ డిమాండ్ చేసారు.గురువారం బిసి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రాజేందర్ మాట్లాడుతూ 15 రోజుల్లో నిధులు కేటాయించకపోతే ఇంద్రా పార్క్ దగ్గర ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు గడిచిన బీసీలకు ఇంతవరకు లోన్లు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమని సి రాజేందర్ ప్రభుత్వం పై మండిపడ్డారు.బ్యాంకుతో సంబంధం లేకుండా ఒక్కొక్క కుటుంబానికి లక్షల నుండి 10 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేసారు.బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా ప్రభుత్వాలు చూస్తున్నారు తప్ప వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద ఇంత వరకు పట్టించుకోకపోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికలలో బీసీలకు వేల కోట్లు ఇస్తున్నట్లు నోటి ద్వారా అనడం తప్ప ఆచరణలో ఇంతవరకు ఏమి ఇచ్చింది లేదని, కావున బీసీల అందరు ఆలోచించాలన్నారు. ఈసారి బీసీలకు మోసం చేసే ప్రకటనలు చేసే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.వెంటనే బీసీల స్థితిగతులపై ప్రభుత్వం ఒక ఐదు మంది మంత్రులతో ఒక కమిటీ వేసి నిజా నిజాలు నిగ్గు తేల్చాలన్నారు.బిసి బీసీ కార్పొరేషన్ నిధులు ల పై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కృష్ణయ్య తో చర్చలు జరపాలని రాజేందర్ ప్రభుత్వాన్ని సూచించారు.ఈ సమావేశం లో బిసి ఐఖ్యవేదిక రాష్ట్ర అద్యక్షులు అనంతయ్య,బలరాం,బాలయ్య, సంతోష్  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.