ముస్లిం  మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత

..  ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  రాష్ట్ర ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో ప్రభుత్వం ముస్లిం  మైనారిటీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారు సామాజికంగా , ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు వారికి ఉద్యోగ , ఉపాధి అవకాశాల కల్పన దిశగా పలు చర్యలను తీసుకుంటున్నది. ముస్లిం మైనారిటీల జీవితాల్లో మార్పులు తేవాలని ప్రభుత్వం ఆచరణాత్మక విధానాన్ని అమలు చేస్తున్నది. 2022-23 బడ్జెట్లో మైనారిటీల సంక్షేమం కోసం గతం లో ఎన్నడూ లేని విధంగా రూ.1724.696 కోట్లు కేటాయించింది. ఇతర వర్గాలతో సమానంగా మైనారిటీలకు సముచితమైన వాటా దక్కేలా చూడటంతో పాటు వారి సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది.

        ఎస్.సి, ఎస్.టి , బి.సి ల తో సమానంగా మైనారిటీల కోసం షాదీ ముబారక్ ను అమలు చేస్తున్నది. ఇప్పటి వరకు 2014 -15 నుండి ఇప్పటి వరకు 2,28,200 మందికి ఆర్థిక సహాయం అందించడమైనది. షాదీ ముబారక్ పథకం ద్వారా ఒక్కొకరికి రూ.1,00,116 /- ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుచున్నది. దీని ద్వారా పేద మైనారిటీలకు ఎంతో మేలు చేకూరుతున్నది. తమ ఆడ పిల్లల వివాహాలకు ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోయాయి. 2014-15 నుండి 2022-23 వరకు రూ.2165 కోట్లు ఈ పథకానికి కేటాయించడమైనది.

        రాష్ట్రంలో కే.జి తో పి.జి విద్యలో భాగంగా మైనారిటీలను ఉచిత విద్యను ఉన్నత ప్రమాణాలతో  అందించాలని 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించడంతో పాటు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయడం జరిగింది. మైనారిటీ విద్యాసంస్థలలో 1,30,560 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నాయి. ఒక్కొక్క సంస్థలలో 640 మంది విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరుగుచున్నది.107 బాలురు , 97 బాలికలకు సంబంధించిన విద్యాలయాలు ఉన్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించి వారికి విలువతో కూడుకున్న పరిజ్ఞానం అందించడం , తద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.

        మైనారిటీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి సి. ఏం. ఓవర్ సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని 2015 – 2016 లో ప్రారంభించడం జరిగింది. 2015 నుండి ఇప్పటివరకు 2725 మంది ఈ పథకానికి ఎంపిక అయ్యారు. 436 కోట్ల ఆర్థిక సహాయం అందించడమైనది. ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 2022-23 బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించడమైనది. మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లో రూ. 40 కోట్లు , ట్యూషన్ ఫీజు రీయంబర్స్ మెంట్ కు రూ. 150 కోట్లు కేటాయించడమైనది.

        మైనారిటీ సంక్షేమ శాఖలో 66 మంది ఉర్దూ ట్రాన్స్ లెటర్లను నియమించడం జరిగింది. ఫకీర్ కమ్యునిటీ వారి సంక్షేమార్థం 110 మోపెడ్స్ ను పంపిణీ , రంజాన్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ , ప్రతినెలా ఇమామ్ లకు రూ. 10 వేలు , మౌజమ్ లకు రూ. 5 వేల హనరోరియమ్ ,  100 మంది మైనారిటీ విద్యార్థులకు ఐ.ఏ.ఎస్ కోచింగ్ , మక్కా మసీదు రిపేర్లకు రూ. 8.48 కోట్లు , అనీసుల్ గుర్బాకు  రూ. 39 కోట్లు , జహాంగీర్ పీర్ దర్గా  అభివృద్దికి 50 కోట్లు ,జామియా , నిజామియా ఆడిటోరియం కు రూ.14.65 కోట్లు . ఇస్లామిక్ & కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ కు రూ. 40 కోట్లు కేటాయించడమైనది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో , డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకం , కుట్టు మిషన్ల పంపిణీ , సబ్సిడీ తో కూడిన బ్యాంక్ రుణాలు , స్కిల్ డెవలప్ మెంట్, తదితర  కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి.

Leave A Reply

Your email address will not be published.