అయ్యల సంతోష్ కు ఘన సన్మానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలం లోని దేశాయిపేట్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో SCST ఉపాద్యాయ సంఘం కామారెడ్డి జిల్లాకు మూడవసారి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నికైనా డాక్టర్ అయ్యల సంతోష్ ను అంబేద్కర్ సంఘ సభ్యులు శాలువా, బుక్ తో సన్మానించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు న్యాలకంటి చిన్న గంగారాం మాట్లాడుతూ అయ్యల సంతోష్ SCST ఉపాద్యాయుల సమస్యలపై పోరాటంలో, హక్కుల సాధనకై తన సమయాన్ని కేటాయిస్తారని,అందుకే మూడవసారి రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్ మరియు ఉపాద్యాయులు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం అభినందనీయం అని ,ఇలాంటి మరెన్నో పదవులు పొందాలని,మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అయ్యల సంతోష్ చేస్తున్న కృషిని గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఊరు పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద పెద్ద సాయిలు, డాక్టర్ రాములు, ఉపాద్యాయులు రాజు, జంగం ప్రశాంత్, అసుకుల సంజీవ్,న్యాలకంటి సంతోష్, శంకర్, ఆసుకుల రాములు, బండారి సైదయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.