గ్యాస్ వినియోగంలో కొత్త పరిమితులు

నెలకు కేవలం 2.. ఏడాదికి 15 గ్యాస్ సిలిండర్లు మాత్రమే

గ్యాస్ వినియోగంలో కొత్త పరిమితుల్ని విధిస్తూ  కేంద్రస్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా వినిపిస్తున్న కేంద్ర నిర్ణయాల్ని చూస్తే.. ఒక వినియోగదారుడు తన కనెక్షన్ మీద ఏడాదికి 15 గ్యాస్ సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయాలన్న రూల్ తీసుకొస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. నెలకు కేవలం బండల్ని మాత్రమే కొనుగోలు చేసేలా చట్టంలో మార్పులు తెస్తారంటున్నారు.సబ్సిడీ మీద అందించే గ్యాస్ బండ పక్కదారి పడుతోందని.. దానికి చెక్ పెట్టేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కొత్త రూల్స్ ను తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.కొత్తగా తీసుకునే నిర్ణయాల్లో భాగంగా ఎవరైనా వినియోగదారుడికి అదనంగా సిలిండర్లు అవసరమైతే.. వారు తమ అవసరాన్ని పేర్కొనటంతో పాటు.. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించిన తర్వాతే.. గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. మోడీ సర్కారు మీద మరింత వ్యతిరేకత రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.ఐనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడనప్పటికీ..మరి..ఈ ప్రచారంలో నిజం ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది

Leave A Reply

Your email address will not be published.