మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

.. క్షమాపణలు చెప్పిన రాందేవ్ బాబా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రాందేవ్‌ క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు తనను క్షమించాలని కోరారు. దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ గతవారం రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్‌ బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రూపాలీ చకాంకర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. రాందేవ్‌ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.