వ్యవసాయదారులకు అవగాహనా సదస్సు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంబి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏఈఓ సంధ్యారాణి, అధ్యక్షతన వ్యవసాయదారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యవసాయ శాఖ ఎడి కరుణాకర్ రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడి రైతులతో మాట్లాడుతూ రైతులు పీఎం కిసాన్ ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. గ్రామంలో ఉన్న 79 మంది రైతుల పెండింగ్ లిస్టు వివరాలను నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులను చరవాణిలో సంభాషించి పీఎం ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలని సూచించారు. పీఎం ఈ కేవైసీ చేసుకొని రైతులకు పీఎం కిసాన్ సన్మాన్ నిది డబ్బులు పడవని రైతులకు తెలిపారు. అనంతరం గ్రామ శివారులోని వ్యవసాయ పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ చారి, రైతుబంధు అధ్యక్షులు భూమిరెడ్డి, రైతులు దత్తు రావు, వెంకట్రావు పాటిల్,అంజయ్యచారి, దత్తు రెడ్డి,గొల్ల భూమన్న,పురం నాగభూషణం, కిషన్ రావు, విట్టల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.