అన్నం పెట్టె రైతులకు అండగా తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి

- రైతుల హక్కుల పరిరక్షణ కు ప్రజలు కలిసి ముందుకు రావాలి - రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి, టేకుల మంజులా రెడ్డి పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశానికి రైతే వెన్నుముఖ అని, రైతు దే రాజం లేదని,దేశానికి అన్నం పెట్టె రైతులకు ప్రభుత్వాలు అన్ని విదాల అండగా నిలువాలని తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి,రంగా రెడ్డి జిల్లా అధ్యక్షురాలు టేకుల మంజులా రెడ్డి డిమాండ్ చేసారు..స్వతంత్ర పోరాటం లో రైతుల పాత్ర అమోగమైనదన్నారు.’జై జవాన్ జై కిసాన్’ ‘అన్న నినాదం తో  స్వతంత్రం సిద్ధించిన విషయాన్ని ఈ సందర్బంగా మంజులా రెడ్డి గుర్తు చేసారు. కాని నేడు దేశం లో రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా మారాయని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ముందు నుయ్యి..వెనుక గొయ్యి లా మారిందని తద్ద్వార సరైన పంట పండక , అప్పులు తీర్చలేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని మంజులా రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటేనని,రైతులకు కోసం ఆరాటం రైతులకోసం పోరాటం, అన్న నినాదం తో  తమ సమితి ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. దుక్కి దున్నటం నుంచి వంట అమ్ముకునే వరకు అడుగడుగునా అంతా కల్తి అని, విత్తనాలు, ఎరువులు కల్తీ గాళ్ళు ,నకిలీ గాళ్లు వీళ్ళ బారి నుండి రైతులను కాపాడుకోవలసిన భాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉందన్నారు.నిజాం రాజుల నిరంతశత్వం నుండి బయటపడిన తర్వాత కూడా రైతన్న అభివృద్ధికి నోచుకోకపోవడం బాదాకరమన్నారు.. రైతు అనే వాడు నేడు కొంతమంది రాజకీయ నాయకుల రాక్షసత్వానికి బలైపోతున్నాడన్నారు. రైతు అనే వాడికి మోసపోవడమే తెలుసు కానీ మోసం చేయటం తెలియదని, అసలు రైతుగా పుట్టడమే శాపం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. నేడు రాజకీయ నాయకులుప్రైవేటు వ్యాపారస్తులుదళారికేటుగాళ్ల మోసగాళ్ళుకూటమిలో పడి రైతు అనే అమాయకుడు బలైపోతున్నారని అన్నారు. రైతులను కాపాడుకోవలసిన భాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉందన్నారు.ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతుల కొట్లాట అంతా వారి మౌలిక సదుపాయాలైన భూమిచీకునిధులులియామకాలుఇన్పుట్స్మరియు ఇన్ఫ్రాస్టక్చర్స్పంటరుణాలునాణ్యమైన విత్తనాలుకల్తీలేని ఎరువులుకల్తీలేని పురుగుమందులుసరళమైన మార్కెటింగ్ విధానంలో సమూలమైన మార్పులుమరియు భూనిర్వాసితులకు చట్టపరమైన నిర్భపరిహారాలు అందించవలసిన భాద్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందన్నారు. పడవు వడ్డ భూములు పచ్చబడలాపరాయి పాలన లో బెరబడ్డ నలం తలరాతలు మారేలా. ఉరువాడ ఏకం కావాలి. రంది పడిన మన రైతు గుండె నిమ్మలం కావాలి. కంచంలోకి నాలుగు మెతుకులు రావాలి. చేతి ఐదు వేలు నోట్లోకి పోవాలికొలువులు దొరకని మన పోరగాళ్లు పొలం బాట పట్టాలి. రైతు బాధిసత్వంకు చరమగీతం పాడాలి. చివరాకరికి రైతుబిడ్డలు తలెత్తుకొని బ్రతకాలి. ఇవన్నీ జరగాలంటే ముందుగా ఇక్కడ వచ్చిన మనందరం ఏకమై తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని మంజులా రెడ్డి పిలుపు నిచ్చారు

Leave A Reply

Your email address will not be published.