‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా విజయరాయిలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు. అనంతరం ఆయన ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి‘ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జగన్‌రెడ్డి కి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మీటింగ్‌లకు రావొద్దని ప్రజల్ని బెదిరిస్తున్నారని.. ప్రజల్లో చైతన్యం రావాలని.. ధైర్యంగా ముందుకు రావాలని పిలుపిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే డబ్బులిస్తోందని.. అయినా నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి‘ కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం మొత్తం 8వేల మంది పార్టీ బృందాలను నియమించారు. ప్రచార వీడియోలను ప్రత్యేకంగా రూపొందించి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలకు అవసరమైన సమాచారంప్రతి ఇంటా ఇవ్వాల్సిన కరపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని నియోజకవర్గాలకు పంపారు. బాదుడే బాదుడు పేరుతో ఆ పార్టీ సుమారు 7, 8 నెలలపాటు ప్రజల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేసింది. దాంతో పోలిస్తే ఇదేం కర్మ కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలను ఎంచుకుని వాటిపై ప్రతి ఇంటా వివరించాలని నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.