మడెల్ రాజు,ఇధమ్మ ఉత్సవాలను విజయవంతం చేయండి

–రజక సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు చాకలి శ్రీనివాస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్సువాడ మండలంలోని ఇబ్రాహీంపెట్ గ్రామంలో ఈనెల 4 నాడు నిర్వహించే మడెల్ రాజు,ఇధమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని రజక సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు చాకలి శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఎడులాగే ఈ ఏడు కూడా తమ కుల దైవం అయిన మడెల్ రాజు,ఇధమ్మ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సంఘం సభ్యులు అందరూ సహకరించాలని అన్నారు.ఉత్సవాల్లో భాగంగా ఉదయం బోనాలతో ప్రారంభమై,యజ్ఞం,పూర్ణాహుతి,ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదానం తో ముగుస్తుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.