ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా యున్న 44వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద యెత్తున విద్యాశాఖ మంత్రి కార్యలయం ముట్టడి చేశారుఈ సందర్భంగా పెద్ద యెత్తున్న నినాదాలు ఇచ్చారు. ఈ ముట్టడి తెలంగాణ జాక్ ఛైర్మన్ నీల వెంకటేష్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య  మాట్లాడుతూ 44 వేల టిచర్ పోస్టులు భర్తీ చేయకుండ ప్రభుత్వం విద్యావ్యవస్థ ను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. కవైపు ప్రభుత్వం పర్మి నెంట్ టిచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు విద్యా ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. పర్మనెంట్ టీచర్లను నియమించకుండా టెంపరరీ టీచర్లకు రకరకాల పేర్లతో నియమించి విద్య వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. పార్ట్ టైం టీచర్లుగెస్ట్ టీచర్లుఆవర్లి బెసేడ్  టీచర్లువిద్యా వాలంటరీలుకాంట్రాక్టులు టీచర్లు అంటూ రకరకాల పేర్లతో సంవత్సరాల తరబడి తాత్కాలిక టీచర్లను నియమించి విద్యా వ్యవస్థను పాడు చేశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.ఈ సమావేశంలో రాజేందర్అనంతయ్యబత్తులమల్లేష్ యాదవ్,చంటి ముదిరాజుదీపికా బిల్లా, వాణి రెడ్డి,  బి.మణికంఠ,  భాస్కర్, కాకుమాను జ్యోతి తదితరులు పాల్గొన్నా

Leave A Reply

Your email address will not be published.