ఉపాధి కోల్పోతున్న స్వర్ణకారులకు చేయూతనందించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వర్ణకారుల ఆత్మహత్యల గురించి కార్పొరేట్ జ్యువెలర్స్ షాప్ ల మూలంగా ఉపాధిని కోల్పోతున్న స్వర్ణకారులకు చేయూతను అందించాలని బీర్కూర్ తహసీల్దార్ కు మండల స్వర్ణకారసంగ సభ్యులు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ప్రధాన కార్యదర్శి సి.వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో చేతివృత్తులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా స్వర్ణకారుల మనుగడను దెబ్బతీసే విధంగా కార్పోరేట్ తరహాలో నూతనంగా జ్యువలరీ షోరూంలు విరివిగా ఏర్పడుతున్నాయి. దీంతో అనాదిగా తమ కులవృత్తులనే నమ్ముకొని, వృత్తిపైనే ఆధారపడిన స్వర్ణకార కుటుంబాలు పనులు కరువై రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. బంగారం పనులు తక్కువ అవ్వడం మూలంగా గత రెండు నెలల కాలంలో సుమారు 5కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోవు కాలంలో అనేక స్వర్ణకార కుటుంబాలు బలవన్ మరణాలకు పాల్పడే అవకాశం ఉంది, కావున చేతివృత్తిదారులను కాపాడుటగాను మాకు కొంత వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుతు, ప్రభుత్వ పరంగా చేతివృత్తిదారులకు రాయితీతో కూడిన రుణాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే హిందూ వివాహ సాంప్రదాయంలో అతి పవిత్రమైన మంగళ సూత్రం, మట్టెలు, మరియు ప్రతనం ఈ మూడు పనులను మా స్వర్ణకారులే చేసే విధంగా, కార్పొరేట్ జ్యువలరీ షాప్ లలో సాధారణ జ్యువలరీ షాప్ లలో గాని పుస్తె మట్టెలు అమ్మకుండా ప్రభుత్వం ద్వారా ఒక జీవో తీసుకువచ్చి మా చేతి వృత్తులను ఆదుకొవాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.