బీసీల రిజర్వేషన్లు పెంచాకే బిజెపి ఓట్లు అడగాలి

.. బీసీలు అంటే ఓటు వేసే యంత్రాలు కారు .. ఓయూ జెఏసి అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ జనాభాలో సగభాగమున్న బీసీల రిజర్వేషన్లను జరుగుతున్న శీతాకాల పార్లమెంటరీ సమావేశాల్లోనే పెంచాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓయూ జేఏసీ నాయకులు ఎల్చల దత్తాత్రేయ అశోక్ యాదవ్ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తక్షణం అమలు చేసిన మోడీ బీసీలకు మాత్రం మొండి చేయి చూపాడని బీసీ ప్రధానిని అని చెప్పుకునే మోడీ నిజమైన బీసీనా డూప్లికేట్ బీసీనా తెలియాల్సిన అవసరం ఉందనితేల్చి చెప్పారు. ఎవరి జనాభా ఎంతో తేల్చకుండానే కేవలం ఆరు శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిన మోడీ దేశ జనాభాలో సగ భాగమున్న బీసీలకు చేసింది మీ లేదని ఇప్పటికైనా మోడీ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని తక్షణం బిసి కులగల చేయాలని విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ అంశాలలో తక్షణం బీసీల రిజర్వేషన్లు పెంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి యువజన కార్మిక కర్షక ప్రజాసంఘాలతో ప్రత్యేక కార్యచరణతో చలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలియజేశారు. బీసీలను కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూడకుండా వారి స్థితిగతులను మార్చే రిజర్వేషన్లు తక్షణం పెంచాలని వక్తలు డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘాల నాయకులు రవీందర్ నాయక్ అనిల్ ప్రజాపతి, శ్రావణ్ రవితేజ సత్యపాల్ వంశీకృష్ణ నవీన్ శోభన్ తిరుపతి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.