కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని నిరూపించిన విద్యార్థి

.. యూట్యూబ్ ద్వారా పాటలు వింటూ ఎంబీబీఎస్ సీట్ కొట్టిన యువకుడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదని ఓ విద్యార్ధి నిరూపించాడు. యూట్యూబ్ లో క్లాసులు విని పట్టుదలతో ప్రయత్నించి ఎంబీబీఎస్ సీటు సాధించాడు నిరుపేద విద్యార్థి సాయిచరణ్. ఆయన రోజుకు 16 నుంచి 18 గంటలు యూ ట్యూబ్ క్లాసులు వింటూ నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటును సాధించాడు. పూర్తివివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీలో గుండె కోయల్ కర్ సాయిచరణ్ నివాసముంటున్నాడు. గతేడాది నీట్ పరీక్ష రాసి త్రుటిలో ర్యాంకు మిస్సయ్యాడు. షార్ట్ టర్మ్ లోనే ర్యాంకు బాగా వచ్చిందని, లాంగ్ టైం చదివితే కచ్చితంగా ర్యాంక్ సాధిస్తాననే పట్టుదలతో, దృఢ నిశ్చయంతో ప్రయత్నించి సఫలమయ్యాడు. కరీంనగర్ లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఏ కేటగిరీలో సీట్ సంపాదించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్థికంగా పై చదువులు కొనసాగించాలంటే దాదాపు రెండు లక్షల వరకు అవుతుండడంతో వారి కుటుంబానికి భారంగా అవుతుందని కుటుంబ సభ్యులు దాతల అపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలెవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ నంబరును సంప్రదించాలని ( 9989474168, 6305695197 ) కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.