కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని 10నెలల బాలుడు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో జరిగింది ఈ విషాద ఘటన. నెక్కొండ మండలం వెంకట్ తండాలో కొబ్బరిముక్క గొంతులో చిక్కుకొని మణికంఠ అనే పది నెలల బాలుడు మృతి చెందాడు. అయ్యప్పస్వామి మాల ధరించిన తండ్రి మాలు.. ఇంట్లో నిత్యపూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టారు. ఆదివారం బాలుడు ఏడుస్తుండడంతో కొబ్బరి ముక్క చేతికి ఇచ్చింది తల్లి కవిత. కొబ్బరిముక్క గొంతులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు బాలుడు. వరంగల్ లో నవంబర్ 27న వరంగల్ పిన్నవారి వీధిలో విషాదం నెలకొంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి చెందాడు. తండ్రి ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన చాక్లెట్లను.. స్కూల్కి తీసుకెళ్లి తిన్న బాలుడు సందీప్.. గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందాడు. ఇక ఇటీవల ఓ పెద్దాయన.. మటన్ ముక్క గొంతులో చిక్కుకొని ఊపిరాడక చనిపోయాడు. అన్నవాహిక, శ్వాస వాహికలో పుడ్ చిక్కుకోవడం వల్ల శ్వాస అందక ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అంటున్నారు డాక్టర్లు. చాలా రేర్ గా జరుగుతుంటాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.