పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ అన్నారు. పాకిస్థాన్‌ ప్రస్తుతం బలహీనమైన స్థితిలో ఉన్నదని, ఆ దేశం అక్రమంగా ఆక్రమించిన మన భూభాగాన్ని ఇప్పుడు మనం స్వాధీనం చేసుకోగలమని చెప్పారు. దీనిని ప్రధాని మోదీ ప్రభుత్వం తన అజెండాలో చేర్చుకోవాలని సూచించారు. ‘పాకిస్థాన్‌ అక్రమ ఆక్రమణ నుంచి పీఓకేను విడిపించడం మన బాధ్యత. ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము పార్లమెంటులో తీర్మానం చేశాం. ఇప్పుడు, మోదీ ప్రభుత్వం తన అజెండాలో దీనిని కూడా చేర్చాలి. ప్రస్తుతం పాక్‌ బలహీనమైన స్థితిలో ఉంది. దీంతో పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయం’ అని రావత్‌ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.