సిట్ నివేదిక ఎలా బయటకు వచ్చింది?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో సిట్ దాఖలు చేసిన కౌంటర్ లీక్ అవడంపై హైకోర్టు లో వాదనలు జరిగాయి. రహస్యంగా ఉంచాలనుకున్న సిట్ నివేదిక ఎలా బయటకు వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. సిట్ కౌంటర్ కాపీలను పిటిషనర్లు, వారి తరపు న్యాయవాదులకు అందించామని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. పిటిషనర్లు ఓ రాజకీయ పార్టీకి అందించారని వారి ద్వారా మీడియా లీక్ అయిందని ఏఏజీ తెలియజేశారు. ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఓ కాపీ ఇచ్చామని ఆయన ద్వారా సీఎంకు చేరి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కౌంటర్ కాపీ సిట్ ద్వారా బయటకు రాలేదని అదే రోజు పత్రిక ప్రకటనను సీవీ ఆనంద్ విడుదల చేశారని ఏఏజీ హైకోర్టుకు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.