నా కూతురిని చంపిన వాడిని కిరాతకంగా శిక్షించండి

.. శ్రద్ధ వాకర్ తండ్రి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారిస్తుండగా పోలీసులకు రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురిని దారుణంగా హత్య చేసిన తర్వాత శ్రద్ధా తండ్రి మొదటిసారి మీడియాతో మాట్లాడుతూ .. తన కూతురుని ఎంత ఘోరంగా చంపాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితుడిని కూడా అంతే క్రూరంగా చంపాలని కోరాడు. వాడికి ఉరి శిక్ష వేయాలంటూ డిమాండ్ చేశాడు. తన కూతురి హత్యలో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ కుంటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఆ కోణంలోనూ విచారణ జరుపాలని పోలీసులను కోరారు. డేటింగ్ యాప్ ‘బంబుల్’ కారణంగానే శ్రద్ధకు ఆఫ్తాబ్‌తో పరిచయం ఏర్పడిందని చెప్పాడు. 18 ఏళ్లు దాటిన పిల్లల్ని కంట్రోల్‌లో పెట్టాల‌ని, వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాల‌ని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం కేసులో విచార‌ణ జ‌రుగుతున్న తీరు ప‌ట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

అఫ్తాబ్ పూనావాలా గొంతుకోసి హత్య చేసి, శరీర భాగాలను నరికి ఢిల్లీలోని సమీప ప్రాంతంలో పడేసిన శ్రద్ధా వాకర్ తండ్రి వికాస్ వాకర్ కు న్యాయం చేస్తామని ఢిల్లీ పోలీసులు హామీ ఇచ్చారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తనకు న్యాయం జరిగేలా హామీ ఇచ్చారని చెప్పారు. అఫ్తాబ్ పూనావాలాను ఈరోజు ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపరచగా, అతడి జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించారు. అంతకుముందు అఫ్తాబ్ పూనావాలా ప్రయాణిస్తున్న వాహనంపై పోలీసు సిబ్బంది కత్తితో దాడి చేశారు. నార్కో టెస్ట్ , పాలిగ్రాఫ్ టెస్ట్‌లో అఫ్తాబ్ తన స్నేహితురాలు శ్రద్ధను హత్య చేసి, ఆపై ఆమె శరీర భాగాలను 35 ముక్కలుగా నరికినట్లు అంగీకరించాడు. ఈ ఏడాది మే 18న శ్రద్ధ హత్యకు గురైంది.

Leave A Reply

Your email address will not be published.