నేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది

- మీడియా ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో టీఎస్ లా న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ మూడవ వార్షికోత్సవదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు మీడియా ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూనేటి సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని అన్నారు.ఈ యొక్క వ్యవస్థలో రాజ్యాంగానుసారం కొనసాగుతున్న మూడు స్తంభాలైన శాసనశాఖ, కార్యనిర్వాహణ శాఖ, న్యాయశాఖల, విధి విధానాల పనితీరును ప్రజలకు తెలియజేస్తూ తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ సమ సమాజ పునర్ నిర్మాణానికి తోడ్పడుతూ ముందుకు కొనసాగుతున్నటువంటి శాఖ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా శాఖ అని పేర్కొన్నారు. టీఎస్ లా న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. అందుకు తన వంతు బాధ్యతగా సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి టీఎస్ లా న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ వారికి మీడియా ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా తన వంతు సేవలను అందించడానికి ఎప్పుడు ముందుంటానని ప్రభంజన్ యాదవ్ తెలిపారు. తదనంతరం టీఎస్ లా న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి దేశ అభివృద్ధికి వెనుకడుగు వేయకుండా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహానుభావుల ఆకాంక్షను నెరవేర్చడం కోసం , న్యాయాన్ని కాపాడడం కోసం తన వంతు బాధ్యతను సర్వశక్తుల నెరవేరుస్తానని తెలియజేశారు. ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ శాలువాతో టీఎస్ లా న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఘనంగా సన్మానించారు.ఈ యొక్క కార్యక్రమానికి న్యాయవాది ఎర్ర భగవంతురావు, న్యాయవ్యవస్థ విద్యార్థులు, అడ్వకేట్లు, ప్రొఫెసర్లు మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.