తెలంగాణా ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుంది

- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణా ప్రభుత్వం అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.  వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద క్రిస్మస్ వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై క్రిస్టియన్ మతపెద్దలు, వివిధ చర్చిల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని పండుగలను ఘనంగా జరుపుకొనే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా కూడా పేదలకు నూతన దుస్తుల పంపిణీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో డిన్నర్ లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ సందర్బంగా ప్రభుత్వం అందించే గిప్ట్ ప్యాక్ లను ఈనెల 13 వ తేదీన పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో 8 ప్రాంతాలలో డిన్నర్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని చెప్పారు. క్రిస్టియన్ ల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించే క్రిస్టియన్ సంక్షేమ భవనం నిర్మాణ పనులకు ఈ నెల 12 వ తేదీన శంఖుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణం కోసం 2 ఎకరాల భూమి, 2 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ లు హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి, DMC ముకుంద రెడ్డి, మోహన్ రెడ్డి, క్రిస్టియన్ ప్రతినిధులు DD ప్రశాంత్, దయాకర్, జయరాజ్, సుదర్శన్ రావు, TRS డివిజన్ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, రాజు, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, నాయకులు నాగులు, జయరాజ్, అశోక్ యాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.