భారత్‌ – చైనా సైనికుల మధ్య ఘర్షణ.. 30 మందికి గాయాలు

Army.JPG

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గతంలో భారత్‌-చైనా మధ్య గాల్వాన్‌ వద్ద ఇరు దేశాల సైనికుల ఘర్షణ మరోసారి రిపీట్‌ అయ్యింది. అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో చైనా సైన్యం కవ్వింపులకు పాల్పడింది. తవాంగ్‌ సెక్టార్‌ లో భారత భూభాగంలోకి వచ్చిన చైనా సైనికులను ఇండియన్‌ ఆర్మీ అడ్డుకుంది. దీంతో ఇరు దేశాలకు చెందిన సైనికులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన ఈనెల 9న జరిగినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఈ ఘర్షణలో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడినట్లు సమాచారం. గాయపడ్డ భారత సైనికులను అసోం రాజధాని గౌహతికి తరలించారు. గౌహతి ఆర్మీ ఆస్పత్రిలో భారతీయ సైనికులకు చికిత్స జరుగుతోంది. ఘర్షణ జరిగిన సమయంలో 500 మంది సైనికులు అక్కడ ఉన్నారు. 9వ తేదీతో పాటు ఆదివారం కూడా ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. ఈ గొడవలో కొంతమంది సైనికులు కాళ్లు , చేతులు విరిగినట్లు తెలుస్తోంది.

శాంతి నెలకొల్పేలా చర్యలు..

ఈ ఘటన నేపథ్యంలో రెండు దేశాలు శాంతి నెలకొల్పే చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా భారత్‌ -చైనా సైనిక కమాండర్ల మధ్య ఫ్లాగ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశం తరువాత రెండు దేశాలకు చెందిన సైనికులు వెనక్కి తగ్గారు.

ఎల్‌ఏసీ దగ్గర చైనా సైనికులు మన భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించడంతో భారత సైన్యం అడ్డుకుంది. తూర్పు లద్దాఖ్‌లో జరిగిన ఘర్షణల తరువాత ఇరుదేశాల సైనికులు గొడవపడడం ఇదే తొలిసారి.

Leave A Reply

Your email address will not be published.