దానిమ్మ తొక్కలు.. మీ బ్రెయిన్‌ కంప్యూటర్‌ కంటే స్పీడ్‌గా మారుస్తాయ్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నిగనిగలాడే.. దానిమ్మ గింజలను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దానిమ్మలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో.. దానిమ్మలో పొటాషియం, క్యాల్షియం లాంటి మినరల్‌తోపాటు పీచూ తగినంత మొత్తంలో ఉంటుంది. అలాగే విటమిన్‌-సి, కె, బి, ఎ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలోని పోషకాలు గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌, క్యాన్సర్‌, డయాబెటిస్‌ వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే ప్యూనిక్‌ కొల్లాజెన్‌, ప్యూనిక్‌ యాసిడ్‌ ఉంటాయి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే కొవ్వు కరుగుతుంది. దానిమ్మలో గింజల్లోనే కాదు.. దానిమ్మ తొక్కలోనూ అనేక పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. NCBI ప్రకారం, దానిమ్మ తొక్కల్లో ఫినోలిక్ యాసిడ్స్‌, ఫ్లేవనాయిడ్లు, హైడ్రోలైజబుల్ టానిన్‌లు, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీఆక్సిడెంట్‌లు మెండుగా ఉంటాయి. ఇవి బ్రెయిన్‌ షార్ప్‌గా ఉండటానికి ఈ పోషకాలు చాలా ముఖ్యం.

ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా.. మెదడు క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని కోల్పోతుంది.ఇది మతిమరపు, అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలకు దారితీస్తుంది. దానిమ్మ తొక్కలను తీసుకునే వ్యక్తుల మెదడు బాగా పనిచేస్తుందని పబ్మెడ్ పరిశోధనలో తేలింది. దానిమ్మ తొక్కలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. తరచుగా దానిమ్మ తొక్కల టీ తాగితే.. మెదడు చురుకుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ముందుగా 3-4 రోజులు ఎండలో ఎండబెట్టిన దానిమ్మ తొక్కలను తీసుకోండి. వాటిని మెత్తగా మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు ఖాళీ టీ బ్యాగ్‌లో దానిమ్మ తొక్కల పొడిని వేయండి. తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీటిని తీసుకుని సాధారణ టీ బ్యాగ్‌లా దానిలో డిప్‌ చేయండి.
ఇలా కూడా తయారు చేసుకోవచ్చు..
దానిమ్మ తొక్కల పొడిని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఆ తర్వాత టీని ఫిల్టర్‌ చేయండి. టీ గోరువెచ్చగా అయిన తర్వాత, తాగుతూ ఎంజాయ్‌ చేయండి.
పౌడర్‌ ఇలా రెడీ చేయండి..
దానిమ్మ తొక్కలను ఎండలో ఆరబెట్టడానికి సమయం లేకపోతే, మీరు వాటిని ఓవెన్‌లో కూడా ఆరబెట్టవచ్చు. మీరు చేయాల్సిందల్లా దానిమ్మ తొక్కలను ఒక ప్లేట్‌లో ఉంచి ఓవెన్‌లో 350 డిగ్రీల (180 సెల్సియస్) వద్ద 20 నిమిషాలు ఉంచండి. అవి బయటకు తీసి, చల్లారిన తర్వాత పొడి చేసి స్టోర్‌ చేసుకోండి.

Leave A Reply

Your email address will not be published.