నేడు ప్రధాని మోడీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ

.. ఈ భేటీ వెనుక ఆంతర్యమేమిటి?

Modi-Komati-Venkat-reddy.JPG

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బ్యూరో చీఫ్: తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. పొలిటికల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రతి రోజు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం సర్వసాధారణమే. అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొంత కాలంగా కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్‌టాపిక్‌గానే ఉన్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఆయన తీరు పార్టీలోనూ.. నియోజకవర్గంలోనూ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆయన కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డిని పార్టీ నాయకత్వం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా మరో విషయం ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి వెంట్‌ రెడ్డి శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీని కలువనున్నారు. ఉదయం11 గంటలకు ఆయన ప్రధానితో భేటీ అవుతారు. పార్లమెంట్‌లో మోడీని కలువనున్నారు.

నియోజకవర్గ అభివృధ్ధి గురించే ప్రధాని మోదీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తున్నారని చెబుతున్నప్పటికీ.. ఈ భేటీకి రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చనే ప్రచారం రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

రెండు రోజుల కిందట ఖర్గేను కలిసి..

కాగా, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి గత రెండు రోజుల కిందట కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖార్గేను కలిశారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అరగంట పాటు చర్చ జరిపారు. సీనియర్లు సైతం పార్టీని వీడటంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వెంకట్ రెడ్డిని అభినందించిన ఖర్గే

తమ్ముడు పార్టీ మారినా వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నందుకు ఖర్గే అభినందించారు. కోమటిరెడ్డికి ఏఐసీసీ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ సమయంలో భువనగరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వెంకట్‌రెడ్డి ప్రధానిని కలువడం వెనుకున్న ఆంతర్యమేమిటని చర్చించుకుంటున్నారు. అయితే ఆయన రాష్ట్ర రాజకీయాలపై చర్చించనున్నారా.?లేక పార్టీ మారే అవకాశం ఉందా? అంటూ నేతలు చర్చించుకుంటున్నారు.

ఒక ఎంపీ ప్రధానిని కలువడం మామూలేనట..

మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం రోజు రోజుకూ ముదురుతోంది. గతంలోనే వర్గాలుగా విడిపోయి.. అంతర్గత పోరుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ కు వేదికగా మారింది. ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు.

మోడీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతానని వెంకట్‌రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రాజకీయాలు రచ్చ జరుగుతున్న సమయంలో వెంకట్‌రెడ్డి ప్రధానితో భేటీ కావడం గమనార్హం. అంతేకాదు.. ఒక ఎంపీగా ప్రధానితో సమావేశం జరగడం మామూలేనని కోమటిరెడ్ది సన్నిహితులు చెబుతుండటం విశేషం.

Leave A Reply

Your email address will not be published.