ముగిసిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

- వాటిపై 18 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గింపు

GST-Council-Meeting.JPG

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిది:  జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్టీ సహా పలు అంశాలే ఎజెండాగా ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఇందులో కేవలం 15 అంశాలపైనే చర్చించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సమయం కారణంగా కొన్ని అంశాలపై చర్చించలేదని తెలుస్తోంది. ఈ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున పలు విజ్ఞప్తులు చేశారు. మైనర్‌ ఇరిగేషన్‌, కస్టమ్‌ మిల్లింగ్‌, బీడీ ఆకులపై జీఎస్టీ మినహాయింపును కోరారు.

గేమింగ్స్‌పై జీఎస్టీ విధింపు వాయిదా:

క్యాసినో, రేస్‌ కోర్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించి జీఎస్టీ విధింపు అంశాన్ని వాయిదా వేసింది కౌన్సిల్‌. సమయాభావం కారణంగా అంశాన్ని చర్చించలేదని తెలుస్తోంది. ఆన్‌లైన్‌ క్రీడలపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం తన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని అందరు భావించినా.. చివరికు ఎలాంటి చర్చ జరగలేదు.

పప్పుల పొట్టుపై జీఎస్టీ ఎత్తివేత

పప్పులపై పొట్టుపై జీఎస్టీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. పొట్టుపై పన్ను ఐదు శాతం నుంచి జీరో శాతంకు తగ్గింది. అలాగే ఇథనాల్‌పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇథనాల్‌పై 18 నుంచి 5 శాతానికి జీఎస్టీని తగ్గించారు. ఇక జీఎస్టీని ఎగ్గొట్టే సంస్థలకు భారీగా జరిమానా విధించాలని కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.సీతారామన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.