త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ హైదరాబాద్ ప్రతినిధి:

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోయేది లేదంటూనే BRS పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రజల్లో ఉంటున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే ఐదు విడతల ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని కార్యకర్తలలో జోష్ నింపారు. జనసేన అధినేత కూడా ఇప్పటికే ప్రచార రథం వారాహిని సిద్ధం చేసుకొని ఎప్పుడెప్పుడా ప్రజల్లోకి వెళ్ళాలా అని చూస్తున్నారు. ఇక కొత్తగా పార్టీ పెట్టిన YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర పేరుతో 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ కూడా పాదయాత్ర చేస్తానని ఇటీవల ప్రకటించాడు. అయితే ఈ రేసులో కాంగ్రెస్ పార్టీ వెనకపడిందనే చెప్పుకోవాలి. ప్రత్యర్థులతో పోట్లాడాల్సిన కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీలోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నో రోజుల నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాదయాత్ర చేస్తారనే వార్తలు వినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల సంచలన నిర్ణయం..ఇకపై PCC చీఫ్ కార్యక్రమాలకు దూరం ఇక తాజాగా ఈ పాదయాత్రకు సంబంధించి పేరు, ముహూర్తం ఖరారు అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎట్టకేలకు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేపట్టబోయే యాత్రకు సంబంధించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఈ యాత్రకు ‘సకల జనుల సంఘర్షణ’ (హాత్ సే హాత్ జోడో) పేరును ఖరారు చేయగా..జనవరి చివరి వారం నుండి 5 నెలల పాటు నిర్విరామంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాదయాత్ర కొనసాగనుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతుందని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. KCR: కేసీఆర్ నా తాత..కాదంటే ఒకటే మారాం చేస్తున్న చిన్నారి..వైరల్ గా మారిన వీడియో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు కోనసాగుతున్నాయి. నిన్న భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయిన సినియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, జగ్గారెడ్డి, ప్రేమ్ సాగర్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ సహా పలువురు నేతలు రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఇకపై పీసీసీ చీఫ్ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలని మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల హైకమాండ్ ప్రకటించిన కమిటీల అంశం ఓ కొలిక్కి వచ్చే వరకు పీసీసీ చీఫ్ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరం ఉండాలని నిర్ణయించుకున్నారు. మరి అప్పటివరకు కమిటీల అంశం ఓ కొలిక్కి వచ్చి వీరంతా పాదయాత్రలో పాల్గొంటారా లేదా అనేది చూడాలి. టీపీసీసీ చీఫ్ ఎన్నికైన తరువాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే వీలు దొరికినప్పుడు ప్రజలతో నిత్యం మమేకమై ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ సమక్షంలో పలువురు TRS, BJP నాయకులూ హస్తం గూటికి చేరారు. అయితే సొంత పార్టీ నాయకులే రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

Leave A Reply

Your email address will not be published.