బాబాజీ చెప్పాడని ఇంట్లో మూడు సమాధులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: హైదరాబాద్‌ లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో వింత ఘటన చోటుచేసుకుంది. రజియా బేగం, ఇమ్రాన్, ఫాహీం ఇద్దరూ కలిసి ఇంట్లోనే సమాధి నిర్మాణము చేసి పూజలు నిర్వహిస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో పహాడి షరీఫ్‌ లో కలకలం రేపింది. స్థానికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సమాధులను తొలగించారు.

పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో రజియా బేగం, ఇమ్రాన్, ఫాహీం నివాసం ఉంటున్నారు. కలలో బాబా చెప్పాడంటూ రజియా బేగం ఇంట్లోనే సమాధి నిర్మాణం చేశారు. అనంతరం మజీద్ లోకి వెళ్లి సమాధి వెలిసింది అంటూ రజియా బేగం ప్రచారం చేశారు. రజియా బేగం కలలో కి 600 ఏళ్లుగా భూమిలో ఉన్నాను, నేను ఇప్పుడు తిరిగి భూమిపైకి రావాలనుకుంటున్నాను అని బాబ చెప్పినట్లు తెరపైకి మాటలు తెచ్చారు. దీంతో రజియా బేగం ఇంట్లోనే మూడు సమాధులు నిర్మాణం చేశారు. అయితే రజియా చేసిన పనికి స్థానికులు మండిపడుతున్నారు. కేవలం డబ్బులు దోచుకునేందుకే ఇలా చేశారు అని ఆరోపిస్తున్నారు. కాలపత్థర్ నుండి పహాడి షరీఫ్ కు రజియా బేగం కొడుకు ఇమ్రాన్, ఫాహీం వచ్చారు. ఇంట్లో షాప్ లకు పెట్టె బోర్డ్స్ ను తయారు చేస్తున్నామని, స్థానికులు ఇమ్రాన్ చెప్పాడు.
నిందితులు ఎనిమిది రోజుల నుండి ఇంటి పని మొదలు పెట్టారు. 3రోజులు ఇంట్లోనే ఉండి 3 సమాధులు నిర్మాణం పూర్తి చేశారు. కరోణ నుండి పని లేకపోవడంతో ఈపని చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పూజలు చేయడానికి వచ్చే వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవచ్చని కుటుంబం భావించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి భరతం పట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మూడు నమ్మకాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు. డబ్బుకోసం అడ్డమైన దారులు నమ్ముకుని ప్రజల నమ్మకాలను దోచుకునేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.