తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రతినెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకు పని నిమిత్తం వెళ్లే వారు నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకోవడం మంచిది. లేకపోతే మీ సమయం వృధా కావడమే కాకుండా కొంత ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. అలాగే వచ్చే ఏడాది అంటే 2023 జనవరి నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. సెలవులను గమనించి ముందస్తు బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల బ్యాంకులకు వర్తించవు. ఆయా రాష్ట్రాలను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయని గమనించండి.
జనవరి 2023 బ్యాంక్ సెలవులు ఇలా ఉన్నాయి..
- జనవరిలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి
- జనవరి 1 – న్యూ ఇయర్‌తో పాటు ఆదివారం ఉన్నందున కామన్‌గా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
- జనవరి 2 – మిజోరంలో కొత్త సంవత్సరం సెలవు, మిజోరంలో బ్యాంకులకు సెలవు.
- జనవరి 8 – ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- జనవరి 11 – మిజోరంలో మిషనరీ డే, మిజోరంలో బ్యాంకులు మూసి ఉంటాయి.
- జనవరి 12 – స్వామి వివేకానంద జయంతి. పశ్చిమ్ బంగాలో ఈ రోజును బ్యాంకులు బంద్ ఉంటాయి.
- జనవరి 14 – మకర సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్ణాటక, అసోం, సిక్కింలో బ్యాంకులు మూసి ఉంటాయి.
- జనవరి 15- ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- జనవరి 16- కనుమ పండగ- ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు, ఉళవర్ తిరునైల్ పుదుచ్చేరి, తమిళనాడులో బ్యాంకులు బంద్.
- జనవరి 22- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- జనవరి 23- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. అసోంలో బ్యాంకులు బంద్.
జనవరి 25- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అక్కడ మాత్రమే బ్యాంకులు బంద్ ఉంటాయి. - జనవరి 26- రిపబ్లిక్ డే, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- జనవరి 28- నాలుగో శనివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
- జనవరి 29- ఆదివారం, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
- జనవరి 31- మీ – డ్యామ్ -మీ-ఫై అసోంలో బ్యాంకులు మూసి ఉంటాయి.