ముగిసిన కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్ ప్రతినిధి:  న‌వ‌ర‌స న‌ట‌సార్వ‌భౌముడిగా ఎన్నో విల‌క్ష‌ణమైన పాత్ర‌ల‌తో మెప్పించిన సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ శుక్ర‌వారం ఉద‌యం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం మ‌ధ్యాహ్నం జూబ్లీ హిల్స్‌లోని మ‌హా ప్ర‌స్థానంలో ఆయ‌న అంత్య్ర క్రియలు జ‌రిగాయి. ఫిల్మ్ న‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసం నుంచి జూబ్లీ హిల్స్ వ‌ర‌కు అంతిమ యాత్ర కొన‌సాగింది. మ‌హా ప్ర‌స్థానంలో ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియులు పూర్త‌య్యాయి.

కైకాల పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్‌, చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. 700 సినిమాల‌కు పైగా కైకాల న‌టించారు. న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా, రాజకీయ నాయ‌కుడిగా ప‌ని చేశారు. వ‌య‌సు రీత్యా కైకాల స‌త్య‌నారాయ‌ణ గ‌త కొన్ని రోజులుగా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇంట్లోనే ఆయ‌నకు చికిత్స‌ను అందిస్తూ వ‌చ్చారు. కానీ ప‌రిస్థితి చేయి దాటడంతో శుక్ర‌వారం తెల్ల‌వారు జామున నాలుగు గంట‌ల‌కు కైకాల క‌న్నుమూశారు

700కి పైగా సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. చిత్తూరు నాగయ్య సమయం నుంచి నేటి పవన్, మహేష్ వరకు అందరితో కలిసి నటించారు. నటుడిగా ఆరు దశాబ్దాల అలుపెరుగని ప్రయాణం చేసిన ఆయ‌న తుది శ్వాస విడిచారు.

Leave A Reply

Your email address will not be published.