కుటుంబ కలహాలతో ఇద్దరు భార్యాభర్తల ఆత్మహత్యయత్నం

.. భార్యను కాపాడిన స్థానికులు భర్త మృతి

తెలంగాణ జ్యోతి/ బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలంలోని కొల్లూర్ర్ గ్రామానికి చెందిన సునీల్(25) రాజ్యలక్ష్మి గత మూడు రోజుల నుండి గొడవలు పడుతుండగా గురువారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు గొడవపడి చనిపోదామంటూ ఊరి చెరువు కట్టకు వెళ్లి భార్య రాజ్య లక్ష్మి చెరువులో పడి ఆత్మహత్యయత్నం ప్రయత్నించింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి ఆమెను బయటకు తీశారు. భర్త సునీల్ బాడీ దొరకకపోవడంతో గజ ఈతగాళ్ళ సహాయంతో వెతికించగా 2 గంటల తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ రాము అన్నారు.

Leave A Reply

Your email address will not be published.