కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని టెంపుల్ బస్టాండ్ వద్దగల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ట్రస్ట్ ఆదిలీల ఫౌండేషన్ మాతృదేవోభవ సత్సంగ్ దాన్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్ రైట్ కేర్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరము మరియు ఘంటసాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఘంటసాల భక్తి సంగీత కార్యక్రమం అవధాన కార్యక్రమం జరిగినది. కార్యక్రమంలో డాక్టర్ ఆదినారాయణ ఆదిలీల ఫౌండేషన్ అధ్యక్షులు కేబి శ్రీధర్ మాతృదేవో సత్సంగ్ అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టెంపుల్ సెక్రటరీ పాండురంగ చారి డాక్టర్ కే శ్రీనివాస్ రెడ్డి సీఈవో ధాన్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ డెక్కన్ విజన్ ఐ కేర్ సంస్థ  ఘంటసాల అవధాన కార్యక్రమం నిర్వాహకులు డాక్టర్ రహమతుల్లా సంఘ సేవకులు విజయ దేవి అరుణ రెడ్డి వాణి నేతాజీ తదితరులు పాల్గొని ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా  దాన్వి మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ఉచితంగా మాస్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా బ్రహ్మంగారి టెంపుల్ యజమాన్యం డాక్టర్లను టెక్నిషన్స్ ను గాయకులను కళాకారులను ఘనంగా సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.