ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/న్యూస్ డెస్క్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన మంత్రికి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో, ధర్మకర్తలు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి వనదుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక అర్చనలు, పూజలు న్విహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భారతదేశం గంగా, యమున, సరస్వతీ నదుల సమ్మేళనమని, అలాంటి పవిత్ర భూమిలో బీజేపీ ప్రభుత్వం అల్లకల్లోలం చేస్తుందని మండిపడ్డారు.బీజేపీ దుందుడుకు చర్యలను అరికట్టేందుకు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీని నెలకొల్పారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను అందించాలన్న తలంపుతో జాతీయ స్థాయిలో పార్టీని నెలకొల్పేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసి నిధులు కేటాయించారని, పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అదందించి ప్రజాసంక్షేమం కోసం కృషి చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారన్నారు.

Leave A Reply

Your email address will not be published.